పసివాడి ప్రాణం కాపాడిన ఫేస్‌బుక్ లైవ్.. - MicTv.in - Telugu News
mictv telugu

పసివాడి ప్రాణం కాపాడిన ఫేస్‌బుక్ లైవ్..

April 16, 2019

ప్రాణం కాపాడే వైద్యులను దేవుళ్లతో పోలుస్తాం. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాణాలను కాపాడేందుకు వచ్చిన అంబులెన్స్ డ్రైవర్, అందులోని సిబ్బంది కూడా దేవుళ్లే. వారు సమయానికి ఆస్పత్రికి చేర్చకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అందుకే అంబులెన్స్‌కు దారిచ్చి, అందులో ఉన్నవారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉంటుంది. అలా అత్యవసర పరిస్థితుల్లో పక్కకు జరిగి వారికి సహకరించి ఇప్పుడు వార్తల్లో నిలిచారు కేరళ వాసులు .

AMBULANCE MISSION IN 'TRAFFIC' MOVIE MODEL; EXPECT THE PEOPLE'S COLLABORATION

పదిహేను రోజుల పసికందును వైద్యం నిమిత్తం కర్ణాటకలోని మంగళూరు నుంచి కేరళ రాజధాని తిరువనంతపురానికి అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. 600 కి.మీ… 15 గంటల ప్రయాణం. దారిలో ట్రాఫిక్ లో చిక్కుకుపోతే ప్రాణాలు పోయే పరిస్థితి. దీన్ని గుర్తించిన ‘చైల్డ్ ప్రొటెక్ట్ టీమ్ కేరళ’ అనే స్వచ్ఛంద సంస్థ రంగంలోకి దిగింది. ఆ సంస్థ  ఫేస్ బుక్ లైవ్ ఏర్పాటు చేసుంటుంది. అంబులెన్స్ ప్రయాణాన్నిఫేస్‌బుక్‌లో అందరూ లైవ్‌లో చూడొచ్చు. అంబులెన్స్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. దీని వల్ల సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారి ఇవ్వడమే ఈ ఫేస్‌బుక్ లైవ్ ఉద్దేశం. మంగళూరు నుంచి వస్తున్న వాహనానికి ఇబ్బందుల్లేకుండా చూసిందీ సంస్థ.. ఫలితంగా 15 గంటల ప్రయాణాన్ని కేవలం 10 గంటల్లోనే అధిగమించింది అంబులెన్స్.

మదని అనే మహిళకు 15 రోజుల క్రితం కేరళలోని కాసరగోడ్  పట్టణంలోని క్రిష్ట ఆస్పత్రిలో పండంటి మగ బిడ్డ పుట్టాడు. బిడ్డకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో మంగళూరులోని మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాబుకు శ్వాసనాళాలు మూసుకుపోయానని, వెంటనే శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. అదీ తమ దగ్గర కాదని కేరళలోని తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రిలోనే చేయించాలని చెప్పారు. బాబును అక్కడి నుంచి తిరువనంతపురం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మంగళూరులో విమానాశ్రయం ఉన్నా.. విమానంలో బాబును తరలిస్తే శ్వాస ఆడదని, దాని వల్ల బాబు ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో అంబులెన్స్‌లో తరలిస్తూ ఫేస్‌బుక్‌లో  లైవ్‌ ఇచ్చారు. అది చూసిన వారందరూ ఆ బిడ్డకు ఏం జరగొద్దని దేవుణ్ణి మొక్కుకున్నారు.