మరో ప్రయోగంతో అమీర్ ఖాన్.. ట్రెండ్ సెట్ చేస్తాడా ! - MicTv.in - Telugu News
mictv telugu

మరో ప్రయోగంతో అమీర్ ఖాన్.. ట్రెండ్ సెట్ చేస్తాడా !

August 3, 2017

‘ దంగల్ ’ సినిమా తర్వాత అమీర్ ఖాన్ నటిస్తున్న ‘ సీక్రెట్ సూపర్ స్టార్ ’ సినిమా మీద చాలా మంది చాలా ఎగ్జైట్ మెంటుగా వున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమీర్ ఖాన్, కిరణ్ రావ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చైనాలో భారీ కలెక్షన్ రికార్డులను కైవసం చేస్కుంది దంగల్. దాన్ని తలదన్నే రీతిలో ఈ కొత్త సినిమా కూడా రికార్డులు బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గాలు అప్పుడే ఒక అభిప్రాయానికి రావడం యాదృచ్చికం. దంగల్ చిత్రంలో యంగ్ గీతగా బాగా నటించి విమర్శకుల మెప్పు పొందిన జైరా వసీమ్ ఇందలో ప్రాధాన్యత గల పాత్రలో నటిస్తోంది.

ఇన్సియా అనే ముస్లిం యువతిగా తను కన్న సింగర్ కలను నిజం చేస్కోవడానికి పడే తపనను బాగా పండించింది. ముస్లిం కుటుంబాల్లో ఒక ఆడపిల్ల పాటలు పాడటం అనేది సాంప్రదాయ విరుధ్ధం. అలాంటిది ఇన్సియా సింగర్ అవాలనుకుంటుంది. కానీ తల్లి దండ్రులు ససేమిరా అంటారు. అప్పుడు తను సోషల్ మీడియాలో బుర్ఖా కప్పుకొని పాటలు పాడుతూ అప్ లోడ్ చేస్తూ ప్రపంచానికి తనెవరో, తన పేరేంటో, ఎట్ లీస్ట్ ముఖం కూడా తెలియకుండా పాడిన పాటలతోనే పాప్యులర్ అవుతుంది. అమీర్ ఖాన్ ఇందులో సీనియర్ ప్లేబ్యాక్ సింగర్ గా నటించాడు. తను ఆ అమ్మాయి కలను వారి అమ్మానాన్నలను , కట్టుబాట్లను ఒప్పించి నిజం చేసాడా అనేది సినిమాలోనే చూడాలి. మొత్తానికి ఒక సెన్సిటివ్ పాయింటును టచ్ చేసి దాన్ని చర్చకు పెట్టడానికి వస్తున్న ‘ సీక్రెట్ సూపర్ స్టార్ ’ సినిమా 19 అక్టోబర్ 2017 న విడుదల అవనుంది. మరో ప్రయోగంతో వస్తున్న అమీర్ ఖాన్ ట్రెండ్ సెట్ చేస్తాడా లేదా అన్నది సినిమా రిలీజ్ తర్వాతే చూడాలి.