అమీర్‌పేట మెట్రో స్టేషన్లో కామపిశాచి - MicTv.in - Telugu News
mictv telugu

అమీర్‌పేట మెట్రో స్టేషన్లో కామపిశాచి

February 16, 2018

 

అమ్మాయిలు కాస్త ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. సాయం చేస్తామనో, లేకపోతే మరొకటనో చెప్పి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.  హైదరాబాద్  మెట్రో స్టేషన్లో ఓ కీచకుడు పట్టుబడ్డాడు. సికింద్రాబాద్‌కు చెందిన యువతి గురువారం జేఎన్‌టీయూ వెళ్లడానికి మెట్రోరైలు ఎక్కింది.

అమీర్‌పేట స్టేషన్‌ వద్ద ఇంటర్‌చేంజ్‌ సమయంలో ఎలా వెల్లాలంటూ అక్కడ విధులు నిర్వహిస్తున్న నితిన్‌ రెడ్డి అనే ఉద్యోగిని  అడిగింది. మూడో అంతస్తుకు వెళ్లాలని చెప్పాడు నితిన్. తర్వాత అక్కడ పెద్దగా జనం లేకపోవడానికి ఆసరాగా తీసుకుని  ఆమెతోపాటు లిప్ట్‌లో ఎక్కాడు. లిఫ్టులో  అసభ్యకరంగా తాకుతూ వేధించాడు. యువతి తొలుత భయపడినా తర్వాత ప్రతిఘటించింది. తర్వాత  ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి  ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నితిన్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మెట్రో ప్రారంభ రోజుల్లో  యువతుల ఫోటోలు అసభ్యకరంగా తీస్తూ ఓ వృద్ధుడు దొరికిపోయిన సంగతి తెలిసిందే.