వీఘర్ ముస్లింలపై అమెరికా యాక్షన్.. చైనాకు షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

వీఘర్ ముస్లింలపై అమెరికా యాక్షన్.. చైనాకు షాక్

June 21, 2022

షింజియాంగ్ ప్రావిన్సులో వీఘర్ ముస్లింలపై చైనా చేస్తున్న అరాచకాలకు చెక్ పెట్టే దిశగా అమెరికా అడుగులు వేసింది. వారితో తయారు చేయించిన వస్తువులను ఎగుమతి చేయకుండా నిషేధం విధించింది. ఆప్రాంతం నుంచి ఇంతకు ముందు టమాట, పత్తి వంటివి నిషేధించగా, తాజాగా నిషేధాన్ని అన్ని వస్తువులపై విధించింది. దాదాపు పది లక్షల మంది వీఘర్ ముస్లింలను బంధించి వారితో వెట్టిచాకిరీ చేయించి ఉత్పత్తి చేసిన వస్తువులు కాబట్టి నిషేధం విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు గతంలో ఆమోదించిన బిల్లు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినట్టైంది. దీనికి రిపబ్లికన్లు కూడా సపోర్ట్ చేశారు. షింజియాంగ్ నుంచి వస్తువులను ఎగుమతి చేసే కంపెనీలు తాము వీఘర్ ముస్లింలను వెట్టిచాకిరీ చేయించి వస్తువులను ఉత్పత్తి చేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కాగా, వీఘర్ ముస్లింల పట్ల చైనా చాలా క్రూరంగా వ్యవహరిస్తోంది. వారిని క్యాంపుల్లో పెట్టి కమ్యూనిస్టు భావాలను వారిపై బలవంతంగా రుద్దుతున్నారు. ఖురాన్‌పై నిషేధం, పంది మాంసం పెట్టడం, గడ్డం తీయించడం, మసీదులను టాయిలెట్లుగా మార్చడం వంటి హేయమైన చర్యలకు పాల్పడుతోంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినా చైనా పట్టించుకోలేదు.