వెనిజువెలా అధ్యక్షుడిపై అమెరికా కేసు - MicTv.in - Telugu News
mictv telugu

వెనిజువెలా అధ్యక్షుడిపై అమెరికా కేసు

March 27, 2020

America Case File Against Venezuela President.

వెనుజువెలా అధ్యక్షుడిపై అమెరికా కేసు నమోదు చేసింది. ఆయనపై పలు కీలక అభియోగాలను మోపింది. నికోలస్‌ మదురో నార్కో ఉగ్రవాదానికి పాల్పడుతున్నాడని ధ్వజమెత్తింది. 

ఉగ్రవాద సంస్థగా గుర్తించిన రెవల్యూషనరీ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఆఫ్‌ కొలంబియా అనుచరులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని అమెరికా ఆరోపించింది. కొకైన్‌ను అక్రమంగా రవాణాకు మద్దతు పలుకుతూ వాటిని అమెరికాకు చేరవేస్తున్నట్టుగా పేర్కొన్నారు. 

దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించిన వారికి 15 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఇస్తామని అగ్రరాజ్యం ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల నుంచి టన్నుల కొద్దీ కొకైన్‌ను తమ దేశానికి పంపి వెనుజువెలా కోట్ల రూపాలు గడిస్తోందని అమెరికా చెబుతోంది. మదురో ఉద్దేశపూర్వకంగానే కొకైన్‌ను సరఫరా చేయిస్తున్నారని ఆరోపించింది. అమెరికా అభియోగాలపై వెనుజువెలా విదేశాంగ శాఖ మంత్రి జార్జ్‌ అర్రెజా ఖండించారు​. ప్రజాస్వామ్య వ్యవస్థపై ట్రంప్‌ ప్రభుత్వం దాడికి దిగడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. కాగా ఇప్పటికే నికోలస్‌ మదురో పై న్యూయార్క్‌, వాషింగ్టన్‌, మియామీ తదితర ప్రాంతాల్లో ట్రాఫికింగ్‌, మనీ లాండరింగ్‌ కింద కేసులు నమోదు చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.