అక్రమ సంబంధం! అమెరికా కాంగ్రెస్ సభ్యురాలి రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

అక్రమ సంబంధం! అమెరికా కాంగ్రెస్ సభ్యురాలి రాజీనామా

October 28, 2019

తన వద్ద పనిచేసే ఉద్యోగులతో అక్రమ సంబంధాలు నెరిపినట్లు ఆరోపణలు రావడంతో అమెరికా కాంగ్రెస్(పార్లమెంటు) సభ్యురాలు కేటీ హిల్ రాజీనామా చేశారు. దేశ, సమాజ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ తనకు కేటాయించిన ఉద్యోగులతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, అయితే లైంగిక సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.

America congress woman.

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి ఆమె డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు.  ఎన్నికల ప్రచార బృందంలోని  పనిచేసిన గ్రాహం కెల్లీని కేటీ తన కాంగ్రెస్ స్టాఫర్‌గా నియమించుకున్నారు. వీరిద్దరి మధ్య సంబంధం ఉందని, ఆఫీసులోనే శృంగారంలో పాల్గొనేవారని వార్తలు వచ్చాయి. కెల్లీకి భారీగా బోనస్ ఇవ్వడం వెనక కారణం అదేనని కథనాలు వెల్లువెత్తాయి. కెల్లీతోపాటు మరో ఉద్యోగినితోనూ కేటీకి సంబంధం ఉందని, ఆమె బైసెక్సువల్ అని మీడియా కోడై కూసింది. వారు సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా వెలుగు చూశాయి. 

దీంతో కాంగ్రెస్ ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. భర్తతో విడాకుల ప్రక్రియ సాగుతోందని, ఈ నేపథ్యంలో తనపై బురద జల్లుతున్నారని ఆమె ఆరోపించారు. ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ కు సంబంధించిన  ఆర్మ్‌డ్ సర్వీసెస్ అండ్ రిఫార్మ్స్ కమిటీకి ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.