ఓడిపోయినా సరే నేనే అధ్యక్షుణ్ని.. ట్రంప్ పిచ్చిమాటలు  - MicTv.in - Telugu News
mictv telugu

ఓడిపోయినా సరే నేనే అధ్యక్షుణ్ని.. ట్రంప్ పిచ్చిమాటలు 

September 25, 2020

Thousands of mosques in Xinjiang demolished in recent years Report..

రాజకంటే మొండివాడు బలవంతుడని సామెత. కానీ అమెరికాలో మాత్రం ఈ సామెత ప్రస్తుతం చెల్లదు. అక్కడ రాజే మొండివాడిగా మారిపోయి హడలెత్తిస్తున్నాడు. త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోయినా సరే గద్దె దిగే ప్రసక్తే లేదని, ఎవరేం చేసుకుంటారో చేసుకోండని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పేశారు.

ఎన్నికల్లో పరాజయం పాలైతే శాంతియుతంగా పదవిని విజేతకు అప్పగించనని ఆయన అన్నారు. ‘ఫలితాలు నాకు వ్యతిరేకంగా వస్తే సుప్రీం కోర్టుకు వెళ్తాను. పోస్టల్‌ ఓటింగ్‌ ప్రక్రియలో పారదర్శకత లేదు. ఆ ఓట్ల ఫలితాలను నేను అసలు  ఒప్పుకోను.. అసలు ఈ విధానాన్నే తీసిపారేయాలి. అప్పుడే పోలింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుంది. నవంబర్ 3న ఎన్నికలు జరిగాక అధికార మార్పిడి ఉండదు. నా ప్రభుత్వమే ఉంటుంది.. చూద్దాం ఏం జరుగుతుందో’ అని చెప్పుకొచ్చారు. కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాలు పోస్టల్ ఓటింగ్(మెయిల్ ఓటింగ్)కు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆయన మొండిగా మాట్లాడారు. ఓటమి భయంతోనే ట్రంప్ పిడివాదానికి దిగాడని విపక్షం మండిపడుతోంది.