అమెరికాలో కాల్పుల మోత.. 12 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో కాల్పుల మోత.. 12 మంది మృతి

September 19, 2020

bullet

అమెరికాలో మరోసారి మారణహోమం జరిగింది. నల్లజాతీయులే టార్గెట్‌గా న్యూయార్క్  సమీపంలోని రోచెస్టర్‌లో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 12 మంది చనిపోయారు. నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఇది చోటు చేసుకుంది.  ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా రక్తపు మడుగుతో నిండిపోయింది. భారతీయ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఇది జరిగింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దీంతో వారందరిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నల్లజాతీయులపై దాడులను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కరోనా కట్టడిలో కూడా ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేస్తున్నారు. ఈ సమయంలో నిరసనకారులపై కాల్పులు జరిగాయి. ఊహించని ఈ పరిణామంతో అంతా కంగుతున్నారు. కాల్పులు జరిపింది ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు. దీనిపై అమెరికా ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా, అమెరికాలో కాల్పులు సాధారణంగా మారిపోయాయి. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటివి చోటు చేసుకుంటూనే ఉన్నాయి.