అమెరికా వెళ్లాలనుకునేవారికి ఆ దేశం గుడ్ న్యూస్ చెప్పింది. వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఇంటర్వ్యూల నుంచి మినహాయించింది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలకు ఈ మినహాయింపును వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించింది. తొలిసారి లేదా వీసాను రెన్యువల్ చేసుకునే వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. దీంతో పాటు వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని మరింత తగ్గించేలా ప్లాన్ చేసినట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్స్ విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మినహాయింపులు వర్తించే రంగాలు ఇలా ఉన్నాయి. హెచ్ 2 వీసా, టెంపరరీ అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ వర్కర్స్, అకడమిక్ ఎక్సేంజ్ విజిటర్స్, తాత్కాలికంగా వర్కింగ్ వీసా పొందిన నాన్ ఇమ్మిగ్రెంట్స్ అంటే హెచ్1బీ వీసా, సైన్స్, ఎడ్యుకేషన్, ఆర్ట్స్, అథ్లెటిక్స్, టెలివిజన్, మోషన్ పిక్చర్స్, ట్రైనీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ విజిటర్స్ అంటే హెచ్3 వీసా వారికి ఈ సౌలభ్యం కలుగుతుందని వెల్లడించింది.