అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి

December 6, 2017

అమెరికాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లోని సూరారంకు చెందిన నాగతులసీరామ్ అనే 26 ఏళ్ల యువకుడు చనిపోయాడు. పొద్దున తమకు రామ్ మరణ వార్త తెలిసిందని అతని తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. నాగ తులసిరామ్‌ రెండేళ్ల కింద ఎంఎస్‌ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడి బ్రిడ్జిపోర్ట్‌ యూనివర్సిటీలో చదువుకుంటూ వాటర్‌బరీలో నివాసం ఉంటున్నాడు. తన కుమారుడి మృతదేహాన్ని తీసుకురావాలని, తమను ఆదుకోవాలని అతని తండ్రి జాకబ్.. తెలంగాణ సర్కారును కోరాడు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే వివేకానంద్.. ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.