'అమెరికా లవ్స్‌ ఇండియా'...ట్రంప్ ట్వీట్‌ - MicTv.in - Telugu News
mictv telugu

‘అమెరికా లవ్స్‌ ఇండియా’…ట్రంప్ ట్వీట్‌

July 5, 2020

bvm bm

అమెరికా పౌరులు జులై 4న 244వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు అదేవిధంగా అమెరికా ప్రజలకు శనివారం ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 

దీనిపై యూఎస్‌ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిస్పందిస్తూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని శుభాకాంక్షలకు ట్రంప్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ… థ్యాంక్యూ మై ఫ్రెండ్‌. అమెరికా లవ్స్‌ ఇండియా. భారత్‌ను అమెరికా ఎల్లప్పుడు ప్రేమిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.