కోటి పందులు, కోటి కోళ్లను చంపేయనున్న అమెరికా..తినడానికి కాదు.. - MicTv.in - Telugu News
mictv telugu

కోటి పందులు, కోటి కోళ్లను చంపేయనున్న అమెరికా..తినడానికి కాదు..

May 19, 2020

pig

కరోనా వైరస్ అగ్ర రాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. అమెరికా మొత్తం గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ లో ఉంది. దీంతో బీఫ్, పోర్క్ కబేళాల సామర్థ్యం 25శాతం, 40 శాతం తగ్గిపోయాయి. కబేళాలు తగ్గిన కారణంగా ఫాంహౌజ్‌లలో కోళ్లు, పశువుల సంఖ్య పెరిగిపోతున్నది. వాటిని పోషించి నష్టం పోవడం కంటే చంపడం మేలని యజమానులు భావిస్తున్నారు. 

ఇప్పటికే మంటలనార్పేందుకు ఉపయోగించే ఫోమ్‌తో ఊపిరాడకుండా చేసి కోటికిపైగా కోళ్లను చంపేశారు. సెప్టెంబర్ నాటికి కోటి పందులను కూడా చంపేస్తామని పోర్క్ ఇండస్ట్రీ ప్రకటించింది. పందులను చంపడానికి గ్యాస్, కాల్పులు, మత్తుమందు అధికంగా ఇవ్వడం, బరువైన వస్తువుతో ఒక్కసారిగా మోదడం వంటి పద్ధతులను వినియోగిస్తామని తెలిపింది. అయితే, ఆవుల్ని చంపడం ఇంకా మొదలు కాలేదు. ఎందుకంటే వాటిని పెంచడం మిగతా వాటికన్నా సులభమేనని వాటి యజమానులు తెలిపారు.