భారత్ బాటలోనే అమెరికా.. చైనా ఉక్కిరిబిక్కిరి - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ బాటలోనే అమెరికా.. చైనా ఉక్కిరిబిక్కిరి

July 7, 2020

ngcnxfr

దుందుడుకు చర్యలతో తరుచూ పొరుగు దేశాలతో పేచీ పెట్టుకుంటున్న చైనాకు మెల్లమెల్లగా చెక్ పడుతోంది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఆ దేశ ఆర్థిక రంగంపై ప్రభావం పడేలా 59 యాప్స్ నిషేధించిన సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా ఎక్కువగా వాడే టిక్‌టాక్ కూడా ఉండటంతో ఊహించని రీతిలో నష్టాలు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అదే బాటలోకి అగ్రరాజ్యం అమెరికా కూడా వచ్చింది. తాము కూడా టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఇప్పటికే అక్కడ టిక్‌టాక్‌ కట్టిడి చేయాలనే డిమాండ్ వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ విషయం తెలిసి ఇప్పుడు చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 

కరోనా విషయంలో ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ డ్రాగన్‌పై గుర్రుగా ఉన్నారు. సమయం దొకితే చెక్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నాడు. ఈ క్రమంలో యాప్స్‌పై సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంత్రి మైక్ పాంపియో పరోక్ష్యంగా వెల్లడించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘కమ్యూనిస్టు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అక్కడి కంపెనీలు, చైనా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి.  ముఖ్యంగా టిక్‌టాక్ వంటి యాప్‌లు సేకరించే సమాచారంపై అనుమానాలు ఉన్నాయి. దీనిపై ట్రంప్ కంటే ముందే నేను నిర్ణయాన్ని వెల్లడించడం సరికాదు. కానీ కచ్చితంగా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. కాగా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల మైక్ పాంపియో సమర్థించిన సంగతి తెలిసిందే.