అమెరికా అల్లకల్లోకం.. ఒకేరోజు 1480 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా అల్లకల్లోకం.. ఒకేరోజు 1480 మంది మృతి

April 4, 2020

America Most Affected From Corona

అగ్రరాజ్య అమెరికా అతలాకుతలం అవుతోంది. కరోనా కల్లోలంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వేల సంఖ్యలో రోగులు వచ్చి చేరుతున్నారు. దీంతో అక్కడి జనం భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా పరిస్థితి చేయిదాటి పోయింది. ఓ వైపు పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా.. అదే స్థాయిలో  మరణాలు జరుగుతున్నాయి. కేవలం 24 గంటల్లోనే 1480 మంది మరణించారు. కొత్తగా 32 వేల మంది ఆస్పత్రుల్లో చేరారు. ఇదంతా గురువారం రాత్రి 8.30 నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటల్లో జరిగిన లెక్కలు మాత్రమే కావడంతో మరింత ఆందోళన నెలకొంది. 

జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ కరోనా రోగుల సంఖ్య 2 లక్షల 77 వేల 467 కు చేరింది. 7,402 మంది ఈ మహమ్మారికి బలి అయ్యారు.  చనిపోయారు. శుక్రవారం ఒక్క రోజే 32 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. ఎవరూ అడుగు బయటపెట్టడానికి ముందుకు రాకపోవడతో చాలా వరకూ వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. కోర్టులు కూడా గృహ హింస, చిన్నారులపై దాడులు లాంటి అత్యవసర పిటిషన్లు తప్ప మరే అంశాలను విచారించడం లేదు. పెళ్లిలు, శుభకార్యాలు ఆగిపోవడంతో మ్యారేజీ బ్యూరోలు కూడా మూతపడి ఉన్నాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారినపడి ఎక్కువగా నష్టపోయిన దేశాల్లో అమెరికానే ముందు ఉండటం విశేషం. వైరస్ పుట్టిన చైనాలోనూ ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకోలేదు.