నేను చనిపోయాను శిక్ష రద్దు చేయండి..కోర్టుకెక్కిన ఖైదీ - MicTv.in - Telugu News
mictv telugu

నేను చనిపోయాను శిక్ష రద్దు చేయండి..కోర్టుకెక్కిన ఖైదీ

November 8, 2019

ఇదో వింత కేసు..యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చావువరకు వెళ్లివచ్చి నా శిక్ష పూర్తయిందని పిటీషన్ వేసాడు. బెంజామిన్‌ శ్రైబర్‌ అనే వ్యక్తి 1997లో ఓ హత్య చేసి జైలుపాలయ్యాడు. ప్రస్తుతం అమెరికా, అయోవా రాష్ట్రంలోని పెనిటెన్చరీ జైలులో యావజ్జీవ కారాగారా శిక్ష అనుభవిస్తున్నాడు. 2015, మార్చి నెలలో హఠాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. జైలు అధికారులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు ‘లాభం లేదు, చనిపోయాడు’ అని తెలిపారు. అంతలోనే అతడి గుండె కొట్టుకుంది. దీంతో వైద్యలు అతడిని చికిత్స నిమిత్తం ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. తనకు ‘పునర్జీవ చికిత్స’లుచేయరాదంటూ కొన్నేళ్ల ముందే బెంజామిన్‌ ఓ పత్రం మీద సంతకం చేసినప్పటికీ అతడిని బతికించే ప్రయత్నాలు డాక్టర్లు మానుకోలేదు. (బతికే అవకాశం లేదనుకున్న రోగులకు నరాల్లోకి కొన్ని రకాల రసాయనాలను పంపించి ‘పునర్జీవ చికిత్స’లు చేస్తుంటారు) బెంజమీన్ అపస్మారక స్థితిలోనే ఉండడంతో టెక్సాస్‌లో ఉంటున్న అతని సోదరుడిని పిలిపించి రోగి పరిస్థితి గురించి తెలిపారు. 

America.

మూత్రపిండాల నిండా రాళ్లు పేరుకు పోయాయని, పునర్జీవ చికిత్స ద్వారా ఆయన్ని స్ప్రహలోకి వస్తే ఆపరేషన్‌ చేయవచ్చని తెలిపారు. ‘బెంజామిన్‌కు ఏమైనా బాధ కలుగుతుంటే అందుకు మందులివ్వండి. లేదంటే అలాగే వదిలేయండి’ అని సోదరుడు తెలిపాడు. దీనిని అనుమతిగా భావించిన వైద్యులు అన్ని చికిత్సలు చేసి బెంజామిన్‌ను బతికించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయగానే బెంజామిన్‌ను జైలు అధికారులు తీసుకెళ్లారు. తానూ ఆస్పత్రి పాలైన చావుదాకా వెళ్లి తిరిగి వచ్చిన సంగతి బెంజామిన్‌కు తెల్సింది. దీంతో 2018, ఏప్రిల్‌ నెలలో జిల్లా కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశాడు. తనకు విధించిందీ యావజ్జీవ కారాగార శిక్ష కనుక, తన చావుతో అది ముగుస్తుందని, తాను ఆస్పత్రిలో చనిపోయినప్పుడే అది ముగిసిపోయిందని, అనవసరంగా నాలుగేళ్లు అదనంగా తనను జైలులో ఉంచారంటూ కేసు వాదించాడు. అందుకు సంబంధించి ఆస్పత్రి రికార్డుల కాపీలను కూడా సమర్పించాడు. వాదోపవాదాలు విన్న తర్వాత కేసులో జీవం లేదని, అస్సలు పరిశీలనార్హం కూడా కాదంటూ జిల్లా జడ్జీ తీర్పు చెప్పారు. దాంతో తీర్పును సవాల్‌ చేస్తూ బెంజామిన్‌ న్యాయవాది అయోవాలోని అప్పీళ్ల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం రోజున అప్పీళ్ల కోర్టు తీర్పు చెప్పింది. ‘యావజ్జీవ కారాగార శిక్ష అంటే డాక్టరిచ్చే డెత్‌ సర్టిఫికెట్‌తో ముగిసేది కాదు. బతికున్నంత కాలం జైలులో ఉంచడమే యావజ్జీవ కారాగార శిక్ష. పైగా నీవు బతికి లేకుంటే కోర్టుకు ఎలా వచ్చావు?’ అంటూ జడ్జీ కేసును కొట్టివేశారు.