గంటకు  10,629 కి.మీ. వేగంతో వెళ్లింది.. భూమిపైనే  - MicTv.in - Telugu News
mictv telugu

గంటకు  10,629 కి.మీ. వేగంతో వెళ్లింది.. భూమిపైనే 

September 13, 2019

దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడంలో అగ్రరాజ్యం అమెరికా మరో ఘనత సాధించింది. సాంకేతికతను ఉపయోగించి అత్యంత వేగంగా దూసుకెళ్లే ‘హైపర్ సోనిక్ రాకెట్ స్లెడ్’ ను విజయవంతంగా పరీక్షించారు. న్యూమెక్సికోలోని హోలోమ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కేంద్రంగా దీన్ని ప్రయోగించారు. ఈ స్లెడ్ గంటకు సుమారు 6,599 మెళ్ల వేగంతో దూసుకెళ్లింది. 

ఈ వీడియోను అమెరికా ఎయిర్ ఫోర్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను పరిశీలించి చూస్తే కనీసం కంటితో చూడటానికి కూడా వీలులేనంత వేగంగా ఈ రాకెట్ స్లెడ్ ట్రాక్‌పై దూసుకెళ్లింది. దూరంగా ఉన్నప్పుడే దాని నుంచి వచ్చే కాంతి కనిపిస్తుంది. ఇది గంటకు 10,620 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. హాలోమ్యాన్ బేస్ ను అమెరికా 1949 నుంచి తన మిలటరీ ప్రయోగాలు, పరీక్షల కోసం వాడుతోంది.  ఇక్కడ అనేక రకాల రాకెట్ స్లెడ్‌ను పరీక్షిస్తున్నారు. తాజాగా అత్యంత వేగవంమైన స్లెడ్‌ను ఆ దేశం విజయవంతంగా ప్రయోగించింది.