America under snow bomb cyclone
mictv telugu

అమెరికాలో మంచు బీభత్సం

December 27, 2022

America under snow bomb cyclone

రోజురోజుకూ అమెరికాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఒక పక్కన మంచు ఆపైన చల్లటి గాలులు కలిసి అక్కడి ప్రజలను చంపేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు -50 కన్నీ తక్కువకు పడిపోతున్నాయి. కెనడాలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడి మంచు తుఫాన్ను బాంబ్ సైక్లోన్ అని పిలుస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో మంచు గుట్టగుట్టలుగా పేరుకుపోయి ఉంది. వెలుగు అన్నది లేకుండా పోయింది. ఇప్పటికి అన్ని రాష్ట్రాల్లో కలిసి 50 మంది దాకా చనిపోయుంటారని అంచనా వేస్తున్నారు. ఒక్క న్యూయార్క్ లోనే 28 మంది చనిపోయారు. మొత్తం 20 కోట్ల మంది ఈ బాంబ్ సైకోలన్ కు ఎఫెక్ట్ అయ్యారని లెక్కలు చెబుతున్నాయి. దీనికి తోడు కరెంట్ కట్ తో కూడా ఇబ్బందులు పడుతున్నారు. చలి ఉన్నప్పుడు హీటర్ల మీద బతుకుతారు అక్కడి జనాలు. కరెంట్ లేకపోతే అవి కూడా పనిచేయవు. అటు చలి, ఇటు కరెంట్ లేకపోవడంతో వాళ్ళ పాట్లు మామూలుగా లేవు.

లాస్ట్ గురువారం మొదలైన స్నో ఫాల్ ఇంకా పడుతూనే ఉంది. మొత్తం పది రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంది. వీటిల్లో మాంటెన్నా, నార్త్ డకోటా, మిన్నెసోటా, మిషిగన్, ఐయోవా, ఇండియానా, నెబ్రాస్కా, న్యూయార్క్, విస్కాన్సన్ నగరాలు ఉన్నాయి. అత్యంత ఆశ్యర్యకరంమైన విషయం ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉండి అస్సలు మంచు పడని రాష్ట్రంగా పేరు పొందిన మయామిలో కూడా ఈసారి ఉష్ణోగ్రతలు -50 కి పడిపోవడం. మంచు పడుతున్న రాష్ట్రాల్లో గంటకు 35 మైళ్ళ కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయి. దీన్ని అక్కడ బ్లిజార్డ్ కండిషన్ అంటారు. న్యూయార్క్ లోని స్నైడర్ లో 56 అంగుళాల వరకు మంచు పేరుకుపోయింది. మిషిగన్ లో 42 అంగుళాలు మంచు కురిసింది.