అమెరికా స్పేస్‌లోకి చీపురు కట్ట మీద వెళ్తుందిలే.. రష్యా ఎగతాళి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా స్పేస్‌లోకి చీపురు కట్ట మీద వెళ్తుందిలే.. రష్యా ఎగతాళి

March 4, 2022

01

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించగా.. దానికి ప్రతిగా రష్యా అమెరికాకు రాకెట్ ఇంజిన్ల సరఫరాను నిలిపివేస్తునట్టు ప్రకటించింది. అంతేకాక ఇప్పటివరకు సరఫరా చేసిన 122 ఆర్‌డీ 180 ఇంజిన్ల సర్వీసును కూడా ఆపివేసింది. ఇక అమెరికా తమ దేశంలో తయారయ్యే చీపురు కట్టలపై అంతరిక్షంలోకి వెళ్లాలంటూ రష్యా అంతరిక్ష ఏజెన్సీ చీఫ్ ద్విమిత్రి రోగోజిన్ హేళనతో కూడిన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు రష్యా తమ అంతరిక్ష రాకెట్ సూయజ్ నుంచి జపాన్, బ్రిటన్, అమెరికా దేశాల జండాలను తొలగించింది. భారత జెండాను మాత్రం అలాగే ఉంచింది. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ద్విమిత్రి.. కొన్ని దేశాల జెండాలు లేకపోతే తమ నౌక మరింత అందంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మరోవైపు కజకిస్తాన్ నుంచి రష్యా ప్రయోగించే అన్ని ఉపగ్రహ ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టు బ్రిటన్ శాటిలైట్ కంపెనీ తెలిపింది.