విదేశీ విద్యార్థులు వెళ్లిపోవాల్సిందే.. అమెరికా సంచలనం - MicTv.in - Telugu News
mictv telugu

విదేశీ విద్యార్థులు వెళ్లిపోవాల్సిందే.. అమెరికా సంచలనం

July 7, 2020

bcgvcg

అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ సంచలనం నిర్ణయం తీసుకుంది. వెంటనే తమ దేశం వదిలి వెళ్లిపోవాల్సిందేనని షాక్ ఇచ్చింది. ఆన్‌లైన్ బోధన కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు తమ దేశంలో ఉండాల్సిన పని లేదని అభిప్రాయపడింది. ఒక వేళ ఆదేశాలను పాటించకుండా అక్కడే ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఎఫ్‌1, ఎం1 విద్యార్థులకు మాత్రం వెసలుబాటు కల్పిస్తున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ వెల్లడించింది. దీంతో చాలా మంది విద్యార్థులు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. 

యూఎస్‌లో కరోనా అదుపుతప్పి విస్తరిస్తోంది. జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ మహమ్మారి వైరస్ వల్ల చాలా విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ ద్వారనే విద్యాబోధన చేస్తున్నారు. దీంతో ట్రంప్ విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చారు. ఆన్‌లైన్ చదువుల కోసం రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు వీసాలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఎఫ్‌1, ఎం1 విద్యార్థులు మినహా మిగితా వారు వెళ్లిపోవాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచించారు. కాగా తాజా లెక్కల ప్రకారం అక్కడ సుమారు 11 లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. దీంతో వీరిలో మెజార్టీ విద్యార్థులు తిరిగి తమ దేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ విద్యార్థులు కూడా ఎక్కువ మందే అమెరికాలోని పలు యూనివర్సిటీలో వివిధ కోర్సులు చేస్తున్న సంగతి తెలిసిందే.