అమెరికాలో ‘దోశ మ్యాన్‌’..! - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో ‘దోశ మ్యాన్‌’..!

May 30, 2017

అతను దోశ స్పెషలిస్టు. మూడు, నాలుగు కాదు.. ఏకంగా 44 రకాల దోశలు వేయడంలో ఫేమస్. అతని దోశ అంటే న్యూయార్క్ వాళ్లు పడిచస్తారు. మార్నింగ్ నుంచి ఈవెనింగ్ దాకా అతని కొట్టు కిటకిటలాడుతుందంటే…ఏంటా స్పెషలో తెలుసుకోవాలనుకుంటున్నారా..
తిరుకుమార్‌.. న్యూయార్క్‌లో స్పెషల్ దోశలకు కేరాఫ్ అడ్రస్. సౌతిండియాన్లకు అత్యంత ఇష్టమైన వంటకం దోశలతో ఫేమస్ అయ్యాడు. శ్రీలంకకు చెందిన తిరుకుమార్ 44 రకాల దోశలు వేస్తూ న్యూయార్క్ వాసుల మనస్సు దోచుకున్నాడు. అందులో రోటీ, కూర, కేకులు, సమోసాలు, తన ప్రత్యేకమైన దోశలను అమ్ముతున్నాడు.అంతే కాదు వారి చేత ‘‘దోశ మ్యాన్‌’గా పిలిపించుకుంటున్నాడు.

శ్రీలంక నుంచి అమెరికా వచ్చిన తిరుకుమార్ కు ఒక్కసారిగా ఇంత పేరురాలేదు. ఎన్నో కష్టాల్ని తట్టుకుని ఈ స్థాయికి వచ్చాడు. అమెరికాకు వలస వెళ్లిన తిరుకుమార్‌ మొదట నిర్మాణ రంగంలో కార్మికుడిగా జీవితాన్ని మొదలుపెట్టాడు. తర్వాత రోడ్డు పక్కన అల్పాహారం విక్రయించే చిన్నపాటి దుకాణం పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. సుమారు మూడున్నరేళ్ల తర్వాత ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతి పొందాడు. 2001లో వాషింగ్టన్‌ స్క్వేర్‌ పార్క్‌ దగ్గర దుకాణం ప్రారంభించాడు. ఇక అప్పటి నుంచి వెనుక్కి తిరిగి చూడలేదు. తిరుకుమార్‌ దోశ కార్ట్‌కు కాలిఫోర్నియా, జపాన్‌లో ఫ్యాన్‌ క్లబ్స్‌ ఉన్నాయి.