American actress apologizes to Ram Charan
mictv telugu

రామ్ చరణ్‌కు అమెరికన్ నటి క్షమాపణలు..ఆ విషయంలో తప్పు జరిగిందని..

February 25, 2023

 

American actress apologizes to Ram Charan

అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా హాలివుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ తారలందరూ తళుక్కున మెరిశారు. అమెరికన్ నటి టిగ్ నొటారో(Tig notaro) వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రామ్ చరణ్‌ అవార్డు ప్రజెంటర్‎గా పాల్గొని సందడి చేశారు. హాలీవుడ్ నటి అంజలి భీమానీతో కలిసి బెస్ట్ వాయిస్ అవార్డును అందించారు. ఈ సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది

ఆర్ఆర్ఆర్ హీర్ రామచరణ్‌ను వేదికపై పిలిచే సమయంలో యాంకర్‎గా ఉన్న టిగ్ నొటారో కాస్త కన్ఫ్యూజ్‎కు గురైంది. చరణ్ పేరు పలకలేక ఇబ్బంది పడింది. చరణ్ పేరును పిలిచేందుకు వెనుకున్న వారి సహాయం తీసుకుంది. దీనిపై రామ్ చరణ్ వద్దకు వెళ్లి క్షమాపణలు కోరింది. చరణ్ అనే పదాన్ని ఎలా పలకాలో తెలియడం లేదని అని ఆమె చెప్పారు. ఇక రామచరణ్ పక్కన నిల్చొని అవార్డు అందించడం ఆనందంగా ఉందని హాలీవుడ్ నటి అంజలి చెప్పుకొచ్చారు.

హాలివుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజనల్ సాంగ్(నాటు నాటు), బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ వంటి విభాగాల్లో అవార్డులను పొందింది. మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట పండడంతో దర్శకుడు రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు.