మంత్రి కేటీఆర్‌తో అమెరికా కాన్సులేట్ జనరల్ భేటీ - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రి కేటీఆర్‌తో అమెరికా కాన్సులేట్ జనరల్ భేటీ

September 11, 2019

ఇటీవల జరిగిన తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండవ సారి మంత్రిగా నియమితులైన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అమెరికా కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మాన్ మంత్రి కేటీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండోసారి మంత్రి అయిన కేటీఆర్‌కు రీఫ్‌మాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రీఫ్‌మాన్ ట్విట్టర్‌లో కేటీఆర్‌తో భేటీ అయిన ఫోటోలను పోస్ట్ చేస్తూ… భవిష్యత్ పట్ల స్పష్టమైన లక్ష్యాలున్న నాయకుడితో మరింత దగ్గరగా కలిసి పనిచేయనున్నట్లు క్యాప్షన్ పెట్టారు. అమెరికా-భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.