ఒక ఆడ, మగ వ్యక్తులు ప్రేమించుకున్నారు. సహజీవనం చేశారు. ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకున్నాక పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు. కానీ పదమూడేళ్ల తర్వాత అకస్మాత్తుగా షాకింగ్ విషయం తెలిసింది. అప్పటివరకు భార్యాభర్తలుగా సంసారం చేస్తున్న తాము ఒకే తండ్రికి పుట్టిన అన్నాచెల్లళ్లమని తేలింది. దీంతో ఇద్దరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకొని షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో టిక్ టాక్ లో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన ఈ జంట 2008లో పెళ్లి చేసుకోగా 2011లో ఓ బిడ్డ, 2015లో రెండో బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఎలా తెలిసిందో తెలియదు కానీ దంపతులిద్దరికీ రక్త సంబంధముందని ఇటీవలే గుర్తించారు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకడేమో ‘మా అమ్మ నన్ను బయట అమ్మాయిలతో తిరగవద్దని చెప్తోంది. ఎందుకంటే మీ నాన్న ఎక్కడెక్కడ అకౌంట్లు ఓపెన్ చేశాడో, ఎంత మంది పిల్లలను కన్నాడో తెలియద’ని కామెంట్ చేశాడు. మరొకరు ఇక నుంచి పెళ్లికి ముందే రక్త పరీక్ష చేయించుకునే పరిస్థితి దాపురించిందని విశ్లేషించాడు. కొందరు కుల్లు జోకులు వేస్తున్నారు. ఇది కామన్ అని కొందరు, ముందే చూసుకోవద్దా అని మరి కొందరు సలహా ఇస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే ఇక నుంచి వీరిద్దరూ ఎప్పటిలాగే కలిసుంటారా? లేక విడిపోయి అన్నాచెల్లెళ్లలాగా ఉంటారా? అన్నది తేలాల్సి ఉంది.