పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్లు కొందరికి విపరీతమైన శృంగార వాంఛలు ఉంటాయి. ఒకరితో తృప్తి కలగక ఏక కాలంలో ఇద్దరితో, ముగ్గురితో రాసలీలలు నెరుపుతారు. ఈ తతంగాలకు ఇంగ్లిష్‌లో ఆయా మనుషుల సంఖ్య పక్క సమ్ జోడించి చెప్పుకుంటారు. అయితే ఏ సమ్ అయినా, ఎంతైనా సారాంశంలో మనుషులు కనక అలాంటి క్రీడల్లో అసూయ కలగడం సహజం. ఫ్రొఫెషనల్స్ విషయంలో అలా జరగదు కాని, నిత్యజీవితంలో మాత్రం సహజమే. మధ్యలో తేడా కొడితే రచ్చరచ్చే. అమెరికాలోని ఫ్లోరిడాలో ముగ్గురి మధ్య సాగిన శృంగారకాండ మధ్యలోనే భంగమైంది. విషయం పోలీసులకు తెలిసి, చేతులకు సంకెళ్లు కూడా పడ్డాయి.
ఫ్లోరిడాలోని మౌనోర్ కంటీలోని కీస్ ప్రాంతానికి చెందిన స్టీవెన్ లోపెజ్(31), ఏంజెలా వివియానా (20) ప్రేమికులు. వీరికి 29 ఏళ్ల వయసున్న ఓ వివాహిత చాలా సన్నిహితురాలు. మనసులు బాగా గాఢంగా కలుసుకున్నాయి. దీంతో లోపెజ్‌కు వెర్రి కోరిక పుట్టింది. ఎప్పుడూ ఇద్దరమేనా, ఓసారి ఆమెతోనూ రాసక్రీడలో పాల్గొందామని ఏంజెలాకు చెప్పాడు. ఆమె ప్రియుడి మాట కాదనలేకపోయింది. ఇద్దరూ తమ ఫ్రెండుకు విషయం చెప్పారు. ఆమె ఏ మూడ్‌లో ఉందో ఏమోగాని భర్తకు తెలియకుండా ఆ జంట ఇంటికి వచ్చింది. ముగ్గరూ త్రింగారంలో పాల్గొన్నారు. కానీ మధ్యలో ఎక్కడో తేడా కొట్టేసింది. ఏంజెలా అక్కసుతో ఆ వివాహితపై తిట్లకు లంకించుకుంది. ప్రియుడు ఆమెకు వత్తాసు పలికాడు. ఇద్దరూ ఆమెను ఒక్కదాన్ని చేసి దాడి చేశారు. అంతే కాకుండా బయటికి వచ్చి ఆమె కారును ఇటుకపెళ్లతో ధ్వంసం చేశారు. బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెసుకుని నవ్వుకున్న పోలీసులు స్టీవెన్, ఏంజెలాను అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. ఏదో ఆవేశంలో కొట్టామని, తమను మన్నించి వదిలేయాలని నిందితులు కోరుతున్నారు.