అగ్రరాజ్యం అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో గూడ్స్ రైలు బోల్తా పడిన ఘటన పట్ల అమెరికా బేంబేలెత్తిపోతోంది. అందులో ప్రమాదకరమైన కెమికల్స్ ఉండడంతో మంటలు చెలరేగి విషవాయువులు పెద్ద ఎత్తున గాల్లో కలిశాయి. దాంతో పాటు నీరు, భూమి క్రమంగా విషపూరితంగా మారిపోతున్నాయి. దీంతో దగ్గరల్లోని ప్రజలు బోర్లలో నీటిని తాగవద్దని ప్రజలకు హెచ్చిరకలు జారీ చేసింది. కేవలం బాటిళ్ళలోని నీరు మాత్రమే తాగాలని ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగింది?
ఓహియో – పెన్సిల్వేనియా రాష్ట్రాల మధ్య ఉన్న ఈస్ట్ పాలస్టైన్ అనే గ్రామం వద్ద ఫిబ్రవరి 4న ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. 150 బోగీలతో కూడిన ఈ రైలులోని 11 బోగీల్లో వినైల్ క్లోరైడ్, బ్యూటైల్ అక్రలేట్ వంటి ప్రమాదకర రసాయనాలను తరలిస్తున్నారు. అయితే ప్రమాదం అనంతరం బంటలు చెలరేగడంతో విషవాయువులు వెలువడ్డాయి. వినైల్ క్లోరైడ్ వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని నేషనల్ కేన్సర్ సెంటర్ హెచ్చరించింది. ప్రమాదం వల్ల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వాతావరణంలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశంలో భయానక విష పదార్ధాలు దట్టమైన నల్లటి పొరల్లా ఏర్పడ్డాయి. ఇది అంతకంతకూ వ్యాపిస్తుండడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ప్రమాదంపై అమెరికా ప్రభుత్వం స్పందించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే వాషింగ్టన్‌లో జరిగితే సహాయక చర్యలు వేరేలా ఉండేవని, కార్పొరేట్ శక్తులను కొమ్ము కాస్తూ తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. కోలింగ్ రగ్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో ‘ఘటనపై ఎలాంటి నిరసన లేదు. పర్యావరణ పరిరక్షకురాలు గ్రెటా కూడా లేదు. అధ్యక్షుడు బైడెన్ మౌనం దాల్చాడు. పర్యావరణ సంరక్షకులమని చెప్పుకునేవారు ఎక్కడ’ అంటూ ప్రశ్నించాడు.
No protests. No Greta. No Biden. No AOC. No Al Gore.
Where are the so called environmentalists for East Palestine?pic.twitter.com/7yedUI4EyJ
— Collin Rugg (@CollinRugg) February 14, 2023