American model Paige Woollen made sensational comments
mictv telugu

‘అందరూ నా బావలే’.. ప్రముఖ మోడల్ సంచలన ప్రకటన

May 24, 2022

American model Paige Woollen made sensational comments

పై డైలాగ్ సినిమాల్లో కొన్ని సందర్భాల్లో వ్యాంప్ పాత్రల ద్వారా చెప్పిస్తారు. కానీ ఓ మోడల్ మాత్రం నిజ జీవితంలో అలాంటి ప్రకటన చేసింది. వివరాలు.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పైగ్ వూలెన్ అనే 28 ఏళ్ల మోడల్ అందరూ తన బావలే అని ప్రకటించింది. ఎందుకు? ఎలా? అని ఆరా తీస్తే మార్కెటింగ్ ట్రిక్కు బయటపడింది. సాధారణంగా సినిమాలు లేదా బ్రాండ్లకు హైప్ క్రియేట్ చేయడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. మన దగ్గర సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్లలో ఈ తరహా మాటలు ఎక్కువగా వినపడుతుంటాయి. ఈ కోవలోనే వూలెన్ ప్రకటనను చూడాలి.

American model Paige Woollen made sensational comments

ఎందుకంటే ఈమెకు ఇన్‌స్టాగ్రాంలో నాలుగు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో వూలెన్‌తో బ్రాండ్ ప్రమోట్ చేయిస్తే తమ ప్రొడక్ట్ ప్రజల్లోకి బాగా వెళుతుందని భావించి ఫ్యాషన్ కంపెనీ నోవా భావించింది. తమ ప్రొడక్ట్ లింజెరీని వూలెన్‌తో రిలీజ్ చేయించింది. ఈ క్రమంలో వినియోగదారుల అటెన్షన్ తన వైపుకు తిప్పుకునేలా వూలెన్ ఈ పదాన్ని వాడింది. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ‘ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఉన్న సినిమాలే సక్సెస్ అవుతాయి. నా ఫాలోవర్లకు ఏం కావాలో ఇస్తేనే నా ప్రొడక్ట్ సక్సెస్ అవుతుంది’ అని నిర్మొహమాటంగా చెప్పేసింది. ఎంతైనా వూలెన్ డేరింగ్ స్టెప్‌కు సోషల్ మీడియాలో అందరూ ఫిదా అవుతున్నారు. తమ అభిమాన మోడల్‌కు అందంతో పాటు తెలివి కూడా ఉందని ప్రశంసిస్తున్నారు.