Viral Video: నాటునాటు పాటపై డ్యాన్స్ ఇరగదీసిన అమెరికా పోలీసులు..వీడియో వైరల్ - Telugu News - Mic tv
mictv telugu

Viral Video: నాటునాటు పాటపై డ్యాన్స్ ఇరగదీసిన అమెరికా పోలీసులు..వీడియో వైరల్

March 14, 2023

వరల్డ్ వైడ్‎గా ‘నాటు నాటు’ ఫీవర్ పెరిగింది. ఆదివారం ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత, ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. నాటునాటు పాటపై అమెరికా పోలీసులు అదిరే స్టేప్పులు వేస్తూ డ్యాన్స్ ఇరగదీశారు.

 

నాటునాటు పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ పాటపై అమెరికా పోలీసులు కూడా డ్యాన్స్ ఇరగీశారు. ఆస్కార్ వేడుకకు ముందు ఈ వీడియోను నేనావత్ జగన్ యూజర్ ట్విట్టర్‌ లో పంచుకున్నారు. వీడియోలో, పోలీసులు పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. హోలీ రోజున ప్రజలు రంగులు, గులాల్‌లతో తడిసి ముద్దవుతుండగా వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. క్లిప్‌లో, బ్యాక్‌గ్రౌండ్‌లో సంగీతం ప్లే అవుతున్నప్పుడు, ఒక వ్యక్తి పోలీసు భుజాలపై చేయి వేసి హుక్ స్టెప్ వేయడం మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.