అమెరికా అధ్యక్షుడు బిడెనే.. మెజారిటీ స్పష్టంగా..  - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా అధ్యక్షుడు బిడెనే.. మెజారిటీ స్పష్టంగా.. 

November 5, 2020

అమెరికా చరిత్రలో అత్యంత వివాదాస్పద శకం ముగిసింది. డొనాల్డ్ ట్రంప్ ఇంటికి వెళ్లిపోతున్నారు. కొత్త అధ్యక్షుడిగా డెమోక్రాట్ల నేత జో బిడెన్ పగ్గాలు చేపట్టనున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన స్పష్టమైన మెజారిటీ సాధించారు. విజయానికి మరో ఆరు ఓట్ల చేరువలో న్నారు. బిడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు దక్కించుకోగా ట్రంప్‌ 214 ఓట్లు గెల్చుకున్నారు. మేజిక్‌​ ఫిగర్‌ (270) బిడెన్ ఖాతాలోకే వెళ్లిపోనుంది. కొన్ని చోట్ల కౌంటింగ్ పూర్తి కాగానే ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. 

ఉత్కంఠగా సాగుతున్న కౌంటింగ్‌లో కొన్నిచోట్ల ట్రంప్ పైచేయి ప్రదర్శిస్తున్నాడు. జార్జియా ఫలితాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి అరిజోనాలో బిడెన్ ముందంజలో ఉన్నారు. ఆరిజోనాలో 70 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత  డెమోక్రాట్లకు మద్దతు దొరికింది. పెల్వేనియాలోనూ బిడెన్‌ దూసుకెళ్తున్నారు. నెవెడాలో సాంకేతిక కారణాల వల్ల కౌంటింగ్ ఆగిపోయింది. తాము ఇప్పటికే విజయం సాధించామని బిడెన్ ప్రకటించారు. అయితే ఫలితాల్లో ఏదో కిరికిరి జరిగిందని ట్రంప్ మండిపడుతున్నారు. దొంగ ఓట్లతో తన ఆధిక్యతను తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ట్రంప్ ఓటమిపై పలు దేశాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాకు భారీగా వలస వెళ్లే భారత్, చైనా, వర్ధమాన దేశాల్లో సంబరాలు జరుగుతున్నాయి.