మాస్క్ పెట్టుకోలేదని కరెంట్ షాక్.. - MicTv.in - Telugu News
mictv telugu

మాస్క్ పెట్టుకోలేదని కరెంట్ షాక్..

September 26, 2020

American woman arrested for not wearing face mask

కరోనా వైరస్ బారి నుంచి కాపాడుకోడానికి అత్యుత్తమ సాధనం ఫేస్ మాస్క్. అయితే అన్‌లాక్ ప్రక్రియ ఊపందుకోవడంతో జనం మాస్కులకు తిలోదకాలిచ్చేసి ఉత్త ముఖాలతో తిరుగుతున్నారు. మాస్క్ పెట్టుకుంటే తమ ముఖారవిందాలను ఎవరు చూస్తారని కొందరు వాపోతుంటే, నిజంగానే మాస్క్ పెట్టుకోలేని పేదరికం మరికొందరిది. కర్చీఫులను కూడా ముఖానికి అడ్డుగా పెట్టుకోవచ్చి వైద్యులు చెబుతున్నా.. అన్ని సందర్భాల్లో అది సాధ్యం కావడంలేదు. మొత్తానికి ఫేస్ మాస్క్‌ను జనం మొదట్లో తీసుకున్నంత సీరియస్‌గా ఇప్పుడు తీసుకోవడం లేదన్నది వాస్తవం. కొన్ని దేశాల్లో మాత్రం మాస్క్ నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. 

 మాస్క్ పెట్టుకోకుండా ఫుట్ ఫుట్ బాల్ మ్యాచ్‌కు వచ్చిన ఓ మహిళను పోలీసులు కరెంట్ షాక్ ఇచ్చి మరీ అరెస్ట్ చేశారు. అమెరికాలోని ఒహాయో రాష్ట్రం మారియెటాలో బుధవారం ఈ సంఘటన జరిగింది. స్కూల్లో జరిగిన మ్యాచ్‌ను చూడ్డానికి వచ్చిన అలిసియా కిట్స్ అనే మహిళ మాస్క్ పెట్టుకోకుండా చప్పట్లు కొడుతూ కూర్చుంది. కొడుకు బాల్ కొడుతుంటే మరింత రెచ్చిపోతూ అల్లరి చేసింది. దీన్ని గమనించిన పోలీసులు మాస్క్ పెట్టుకోవాలని ఆమెకు మర్యాదగా చెప్పారు. అందుకామె కోపంతో రగిలిపోయి ‘యూ ఫక్’ అని బూతులకు లంకించుకుంది. గొడవ ముదరడంతో పోలీసులు ఆమెకు టేజర్ గన్‌తో షాకిచ్చి, చేతులుకు బేడీలు వేసి స్టేషన్‌కు పట్టుకెళ్లారు.