భార్యకు, ప్రియుడికి పెళ్లిచేసిన భర్త.. ఒకే ఇంట్లో ముగ్గురూ కాపురం.. - MicTv.in - Telugu News
mictv telugu

భార్యకు, ప్రియుడికి పెళ్లిచేసిన భర్త.. ఒకే ఇంట్లో ముగ్గురూ కాపురం..

October 22, 2022

‘భార్య ప్రియుడిని చంపిన భర్త,’, ‘భర్త ప్రియురాలిని చంపిన భార్య’ ఇలాంటి వార్తలు వినీవినీ బోర్ కొట్టిందా? వివాహేతర సంబంధాల ముచ్చట్లు చదివిచదివి విసుగొచ్చిందా? అయితే ఈ వార్త మీకోసమే. భర్తనో, లేకపోతే భార్యనో మరొకరితో పంచుకునే ఊహకే బెదిరిపోయే లోకంలో వాళ్లు ముగ్గురూ కొత్త పుంతలు తొక్కి అలాంటి బాపతు వాళ్లకు అత్యంత ఆదర్శంగా నిలిచారు. అన్యోన్యంగా ఉన్న భార్యభర్తలు, తమ మధ్యకు మరో మనిషిని స్వాగతించి ముగ్గరూ కలసి కాపురం చేస్తున్నారు ఒకే కప్పుకింద.

అమెరికాలోని ఇండియానాకు చెందిన ముప్పేట ప్రేమకథ ఇది. ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్న సారా నికోల్(39)ను ఎనిమిదేళ్ల కిందట ర్యాన్‌ అనే పెద్దమనిషిని పెళ్లాడి మొన్నటివరకు చక్కగానే కాపురం చేసింది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల సారా మాజీ ప్రియుడు రోనీ మళ్లీ ఆమెను వెతుక్కుంటూ వచ్చేశారు. పాత ప్రేమ స్మృతులు మర్చిపోని సారా అతణ్ని కరుణించింది. భార్యపై బోలెడు ప్రేమ ఉన్న ర్యాన్ ఆమె ఇష్టాన్ని కాదనలేకపోయాడు. అలాగని ఆమెకు దూరం కావడానికి మనసు రాలేదు. సారాకు కూడా భర్త అంటే ప్రేమే. అతనితో ఉండాలని కోరిక. ప్రియుడన్నా ఇష్టమే. అతనితో కలిసి ఉండాలని కూడా కోరికే. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అదృష్టవశాత్తూ ఘోరాలు, నేరాలకు దారితీయకుండా శుభం కార్డు పడేసుకుంది. రోనీతో తమతో కలిసి ఉండొచ్చని ర్యాన్ పెద్దమనసుతో అంగీకరించాడు. అంతేకాకుండా భార్యకు, ప్రియుడికి ఎంచక్కా శాస్త్రోక్తంగా పెళ్లి కూడా జరిపించాడు. ప్రస్తుతం ముగ్గురూ ఒకే ఇంట్లో ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. రోనీ, సారాల గతంలో ఎంతో గాఢంగా ప్రేమించుకుని ఏవో పొరపొచ్చాలు రావడంతో విడిపోయారు.