మెడికల్ మిరాకిల్.. 30 ఏళ్ల పిండానికి జన్మనిచ్చిన మహిళ - MicTv.in - Telugu News
mictv telugu

మెడికల్ మిరాకిల్.. 30 ఏళ్ల పిండానికి జన్మనిచ్చిన మహిళ

November 26, 2022

మూడు దశాబ్దాలు నిల్వ ఉంచిన పిండానికి అమెరికన్ మహిళ జన్మనిచ్చింది. ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వైద్యశాస్త్రంలో అద్భుతమైనదిగా చెప్పుకుంటున్న ఈ డెలివరీ అక్టోబర్ 31న జరిగింది. 1991లో పుట్టిన టీనా, బెంజిమన్ లకు సహజంగా పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో ఘనీభవించిన పిండం వారికి ఆశాకిరణంగా కనిపించింది. 1992 ఏప్రిల్ 22న స్తంభింపజేసిన పిండాన్ని 2007 వరకు వెస్ట్ కోస్ట్ ఫెర్టిలిటీ ల్యాబులోని కోల్డ్ స్టోరేజీలో ఉంచారు.తర్వాత వాటిని నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటరుకి విరాళంగా ఇచ్చారు.

గత మార్చిలో ఈ పిండం కరగడం ప్రారంభించగా, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా టీనా గర్భంలో ప్రవేశపెట్టడం జరిగింది. పిండం వయసు చూసి ఆశ్చర్యపోయిన టీనా తర్వాత ప్రపంచరికార్డు కోసం ఆలోచించకుండా పిండాన్ని మోసింది. తర్వాత ఇది ప్రపంచరికార్డు అని తెలిసి షాకయింది. కవలల్లో ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల పుట్టగా, ఆడపిల్ల బరువు 2.5 కిలోలు, మగపిల్లాడు 2.92 కిలోల బరువున్నారు. వీరికి లిడియా, తిమోతీ అనే పేర్లు పెట్టుకున్నారు. కాగా, ఇంతకు ముందు ఈ రికార్డు 27 ఏళ్లుగా ఉంది. 27 సంవత్సరాలు ఉన్న పిండం ద్వారా మోలీ గిబ్సన్ అనే మహిళ 2020లో కవలలకు జన్మనిచ్చింది.