American woman who won twice with the same ticket
mictv telugu

అదృష్టం అంటే ఈమెదే.. ఒకే లాటరీపై రెండుసార్లు గెలిచిన మహిళ

July 20, 2022

వేల మంది లాటరీ కొంటే అతి కొద్దిమందికే గెలుపు తలుపు తడుతుందని మనకు తెలుసు. అయినా మనం కొనడం ఆపం. ఒక్కసారైనా అదృష్టం వరిస్తుందేమోననే ఆశతో ప్రతీసారి లాటరీ కొనేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే అమెరికాలోని ఓ మహిళకు మాత్రం అదృష్టం నెత్తిమీద నాట్యం చేసింది. ఒకే లాటరీ మీద రెండు బహుమతులు గెలుచుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల్లోకెళితే.. మేరీల్యాండ్‌లోని హయాట్స్ విల్లే నగరంలో నివాసముండే ఓ మహిళకు మేరీ ల్యాండ్ లాటరీ రేస్ ట్రాక్స్ వర్చువల్ హార్స్ రేసింగులో ప్రతీ వారం పందేలు కాయడం అలవాటు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ఓ గుర్రంపై పందెం కాయగా, లక్కీ దేవత దయ కొద్దీ ఆమె రెండు పందేలను గెలుచుకుంది. రెండు ప్రైజ్‌మనీల విలువ మన కరెన్సీలో రూ. 50 లక్షలుంటుంది. టిక్కెట్ ఖర్చు, పన్నులు పోను మిగిలిన సొమ్ముతో మంచి ఇల్లు కట్టుకుంటానని ఆమె సంతోషంగా చెప్తోంది. అయితే ఫలానా గుర్రంపై పందెం కాయాలని ఆమెకు అంతకుముందే అనిపించిందట. దాంతో టిక్కెట్ కొనడానికి వెళ్లగా మొదటిసారి స్టాక్ లేదని చెప్పి తర్వాత ఓ టిక్కెట్ విక్రయించారట. ఆమె జాతకం బాగుండి అదే టిక్కెటుపై పందెం గెలిచింది.