ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన ఆదాయపు పన్ను సర్వే నేటికీ కొనసాగుతోంది. 2002 గుజరాత్ అల్లర్లపై బిబిసి డాక్యుమెంటరీ తర్వాత ఆదాయపు పన్ను శాఖ చేసిన ఈ ‘సర్వే’ బయటకు వచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంపై అమెరికా కూడా స్పందించింది. ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో భారతీయ పన్నుల అధికారులు నిర్వహించిన సర్వే ప్రచారం గురించి తనకు తెలుసని, అయితే తాము ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. భారత ఐటీ అధికారుల సర్వేలకు తాము సహకరిస్తున్నామని పేర్కొంది. ఢిల్లీ, ముంబైలోని తమ కార్యాలయాలకు ఐటీ అధికారులు వచ్చినట్లు లండన్ లో ఓ బీబీసీ అధికార ప్రతినిధి నిర్ధారించారు. ఈ పరిస్థితులన్నీ కూడా త్వరలోనే చక్కబడుతాయని తాము భావిస్తున్నామని తెలిపారు.
గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో మోదీని టార్గెట్ చేస్తూ ఈ మధ్యే బీబీసీ రెండు భాగాలతో కూడిన డాక్యుమెంటరీ ప్రసారం చేయడంపై తీవ్ర వివాస్పదమైన విషయం తెలిసిందే. బీజేపీ నేతలు బీబీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు బీబీసీ అఫీసుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీబీసీ ఆఫీసులకు ఐటీ అధికారులు వెళ్లడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ జర్నలిస్టుల సమాఖ్య తీవ్ర స్ధాయిలో తప్పుబట్టాయి. కీలక అంశాలపై నోరెత్తకుండా ఉండేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.