రచ్చ గెలిచి.. ఇంట్లో ఎదురీదుతున్న రాహుల్ - MicTv.in - Telugu News
mictv telugu

రచ్చ గెలిచి.. ఇంట్లో ఎదురీదుతున్న రాహుల్

May 23, 2019

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. మొత్తానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుంది. మరోవైపు తొలిసారి దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ  విజయం సాధించారు.

కానీ, కాంగ్రెస్‌ కంచుకోట అయిన ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీలో మాత్రం రాహుల్‌ ఎదురీదుతున్నాడు. ఇక్కడ బీజేపీ నేత స్మృతి ఇరానీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ 2004 నుంచి అమేథీ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నాడు. ఇక దక్షిణాది నుంచి పోటీ చేయాలనీ నిర్ణయించుకున్న రాహుల్‌.. వయనాడ్‌ను ఎంచుకున్నారు. అయితే ఇది రాహుల్‌ అమేథీ గెలుపుపై ప్రభావం చూపించింది. దేశవ్యాప్తంగా ప్రచారాలు చేపట్టడంతో పాటు, వయనాడ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో రాహుల్‌ అమేథీ ప్రజలకు అందుబాటులో లేకపోయారు. దీంతో అక్కడి ఓటర్లు స్మృతి ఇరానీకి మొగ్గు చూపినట్లు కన్పిస్తోంది.