అమీర్ పేట మెట్రో స్టేషన్లో ‘బాంబు’ కలకలం - MicTv.in - Telugu News
mictv telugu

అమీర్ పేట మెట్రో స్టేషన్లో ‘బాంబు’ కలకలం

December 3, 2017

హైదరాబాద్ మెట్రో మొదలై రైళ్లు కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో అమీర్ పేట స్టేషన్‌లో ఓ బ్యాగు కలకలకం సృష్టించింది. ఆదివారం ఉదయం అక్కడ ఎవరో ఒక బ్యాగును వదిలేసి వెళ్లారు. ఒక ప్రయాణికుడు అందులో ఏముందో చూడగా గట్టిగా తగిలింది. దీంతో బాంబు అనుకుని ఫోన్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఉరుకులు పరుగులు పెడుతూ ఆ ప్రాంతానికి వచ్చారు.బాంబ్ స్క్వాడ్ ఆ బ్యాగును పరిశీలించగా అందో హెల్మెట్ కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కూడా పోలీసులను కలిశాడు. అతన్ని పోలీసులు మెచ్చుకున్నారు. మెట్రో రైలు ఎక్కడానికి టూవీలర్‌పై వచ్చిన ఓ వ్యక్తి తన హెల్మెట్‌ను బ్యాగులో ఉంచి  రైల్వే స్టేషన్‌లో పెట్టి వెళ్లిపోయాడు. అది అనుమానాస్పదంగా కనిపించడంతో ఒక ప్రయాణికుడు దాన్ని పరిశీలించాడు.