Amit Mishra shuts Pakistani actress with epic reply after her 'Eat Cow Dung' comment
mictv telugu

ఆవు పేడ తినాలంటూ పాక్ నటి ట్వీట్.. గట్టి కౌంటర్ ఇచ్చిన అమిత్ మిశ్రా

September 8, 2022

టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజా అంశాలపై తన స్టైల్ పంచ్‌లు, కౌంటర్‌లతో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటాడు. తాజాగా ఓ పాక్ నటికి మిశ్రా రిప్లై గా ఇచ్చిన ట్వీట్‌ ఒకటి.. క్రికెట్ ఫ్యాన్స్‌తోపాటు ఆల్ ఇండియన్స్‌ని తెగ ఆకట్టుకుంటుంది. ఆ ట్వీట్‌ను చూసి నెటిజన్లు పర్ఫెక్ట్ కౌంటర్ అంటూ, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. బుధవారం 2022 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు మిశ్రా.. ఒకవేళ అఫ్ఘనిస్తాన్ చేతిలో పాక్ ఓడిపోతే.. తామంతా ఆఫ్ఘన్ చాప్ తింటామని ట్వీట్ చేశాడు. ఆ మ్యాచ్ లో అఫ్గానిస్థాన్‌ విజయం సాధిస్తే భారత్ ఫైనల్‌కు సులువుగా వెళ్లొచ్చనే ఆలోచనతో ఆ ట్వీట్ చేశాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ ఉత్కంఠభరితమైన విజయం సాధించడంతో ఆ ట్వీట్‌ను… పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ.. పిచ్చి మిశ్రా.. అఫ్ఘనిస్తాన్ గెలవలేదు కాబట్టి ఈ వారంతా ఆవు పేడ తింటూ గడుపు అని అసభ్యంగా రిట్వీట్ చేసింది. దీనికి అమిత్ మిశ్రా ఏ మాత్రం సంయమనం కోల్పోకుండా చాలా కూల్ గా “లేదు, నాకు పాకిస్తాన్ వచ్చే ఆలోచన లేదు.” అంటూ ఆ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. దీంతో నెటిజన్లు సరిగ్గా సమాధానమిచ్చావ్ అని మిశ్రాను పొగుడుతున్నారు.