'Amit Shah' Abhivana Sardar Patel: Kishan Reddy
mictv telugu

‘అమిత్ షా’ అభివన సర్దార్ పటేల్: కిషన్ రెడ్డి

September 17, 2022

తెలంగాణ రాష్ట్రంలో నేడు ‘తెలంగాణ విమోచన వేడుకలు’ అట్టహాసంగా మొదలైయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలకు ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..”నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు బలైపోయారు. అప్పుడు హైదరాబాద్లో తొలిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జెండా ఎగరేశారు. మళ్లీ 74 ఏళ్ల తర్వాత మళ్లీ అమిత్ షా వచ్చి, హైదరాబాద్‌లో త్రివర్ణ పతాకం ఎగరేశారు. అమిత్ షా అభినవ సర్దార్ పటేల్. పాతికేళ్లుగా ఈ వేడుకలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు బీజేపీ పోరాటంతోనే విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం” అని ఆయన అన్నారు.

అనంతరం పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా..జాతీయ జెండా ఎగరేసి, అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించి, ప్రసంగించారు.”ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన పార్టీలన్నీ రాజకీయాల కోసమే పని చేశాయి. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్‌కు రాలేదు. ఆనాటి హోం మంత్రి పటేల్ వల్ల హైదారాబాద్‌కు విమోచనం లభించింది. హైదరాబాద్ విమోచనానికి పటేల్ విశేష కృషి చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది.ప్రజలందరూ నిస్సంకోచంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకోవచ్చు” అని ఆయన అన్నారు.