అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు.. - MicTv.in - Telugu News
mictv telugu

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు..

September 13, 2019

Amit Shah.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పటాన్‌చెరులో జరిగే సభకు రావడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రద్దు చేసుకున్నారు. ఈ నెల 17వ తేదిన జరగబోయే సభకు ఆయన రావడం లేదని బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమేందర్‌ రెడ్డి తెలిపారు. ఆయన స్థానంలో ముఖ్య అతిథిగా ఎవరైనా కేంద్రమంత్రి హాజరవుతారని ఆయన చెప్పారు. 

కేంద్ర స్థాయిలో అమిత్‌షా బిజీగా ఉన్నారని, అందుకే రావడం కుదరదని ప్రేమేందర్‌ వెల్లడించారు. ‘తెలంగాణలో మజ్లిస్‌ పార్టీయే సర్వం నడుపుతోంది. మజ్లిక్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇ‍వ్వడం అంటే ప్రజల గొంతుక నొక్కటమే. నిజాం నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేసినవాళ్లను స్మరించుకోవాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి’ అని ప్రేమెందర్ రెడ్డి మండిపడ్డారు. సెప్టెంబర్‌ 17న ‘ఊరు నిండా జెండాలు’ అనే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజు అన్ని మండలాల్లో, మున్సిపాలిటీల్లో జాతీయ జెండాలు ఎగురవేస్తున్నట్టు పేర్కొన్నారు.