విపక్షాలు కుక్కలు, పిల్లులు.. అమిత్‌షా - MicTv.in - Telugu News
mictv telugu

విపక్షాలు కుక్కలు, పిల్లులు.. అమిత్‌షా

April 6, 2018

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విపక్షాలను తీవ్రంగా విమర్శించారు. కుక్కలు, పిల్లులు, పాములు అని దూషించారు. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ కూడా ఒకప్పుడు ప్రాణభయంతో అల్లాడిపోయిన కుక్క, పిల్లేనా అని వ్యంగ్యాస్త్రాలు సంధించాయి. ముంబైలో బీజేపీ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమిత్ ప్రసంగిస్తూ ప్రతిపక్షాలను తూలనాడారు.‘మోదీ ప్రభుత్వం ఎంతో గొప్పగా పనిచేస్తోంది. ఆయనకు తిరుగు లేదు. మా పార్టీ భంజనం వీస్తోంది. వరదలు వచ్చినపుడు కుక్కలు, పిల్లులు, పాములు చెట్లపైకి ఎక్కి, ప్రాణాలు కాపాడుకుంటాయి. బీజేపీ తుపానులో విపక్షాలు కూడా అలా కొట్టుకుపోతాయి..’ అని చెప్పుకొచ్చారు. మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణగల నేత అని అన్నారు. ఆరోపించారు. 

లోకేశ్ ఫైర్..

అమిత్ షా వ్యాఖ్యలు దుర్మర్గంగా, చవకబారుగా ఉన్నాయని ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘మేం 5 కోట్ల మంది ప్రయోజనాల కోసం పోరాడుతోంటే కుక్కలతో పోలుస్తారా? బీజేపీకి వినాశకాలం దాపురించింది.. అందుకే విపరీత బుద్ధి ప్రదర్శిస్తోంది..’ అని ట్వీట్ చేశారు.