Amit Shah met with Telangana core committee leaders
mictv telugu

కోర్ కమిటీ భేటీలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

September 17, 2022

Amit Shah met with Telangana core committee leaders

తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీలో నెంబర్ టూ అమిత్ షా శనివారం పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం హరిత ప్లాజా హోటల్‌కి చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, మునుగోడు ఉప ఎన్నికపై పలు సూచనలు చేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై ఆరా తీసిన షా.. ప్రజల్లో పార్టీ పట్ల సానుకూల అభిప్రాయం ఉందని, నేతలంతా కష్టపడి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. పార్టీలో ఐక్యత అవసరమని, ఎవరికి వారే అన్నట్టు ఉండకూడదని హెచ్చరించారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు బీజేపీ గెలవని తెలంగాణ ఎంపీ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అంతేకాక, ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటవుతాయనే విషయాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సీన్ నుంచి అవుట్ అయిందని అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, అన్నిటికంటే ముందు మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి పెట్టాలని మార్గదర్శనం చేశారు. కాగా, అంతకు ముందు ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజేందర్ తండ్రి మల్లయ్య ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.