Amit Shah security lapse: TRS leader parks his car blocking Shah’s convoy in Hyderabad
mictv telugu

అమిత్ షా కాన్వాయ్‌ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేత కారు!

September 17, 2022

Amit Shah security lapse: TRS leader parks his car blocking Shah’s convoy in Hyderabad

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో కలకలం రేగింది. ఆయన భద్రతలో మరోసారి సెక్యూరిటీ వైఫల్యం బయటపడింది. అమిత్ షా కాన్వాయ్ వెళుతుండగా.. మరో కారు అడ్డుగా వచ్చింది. అమిత్ షా వాహనానికి ఆ కారు సైడ్ ఇవ్వలేదు. దీంతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది కారు అద్దాలు ధ్వంసం చేసింది. హరిత ప్లాజా దగ్గర జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఎస్పీ ఆరా తీస్తోంది.

కాన్వాయ్ కు అడ్డుగా వచ్చిన ఆ కారు టీఆర్ఎస్ నాయకుడిదిగా గుర్తించారు పోలీసులు. గోసుల శ్రీనివాస్ యాదవ్ కావాలనే తన కారుతో అమిత్ షాను అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. శ్రీనివాస్ యాదవ్ ను పంజాగుట్ట పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే తన కారు ఇంజిన్ లోపంతో సడెన్ గా ఆగిపోయిందని చెబుతున్నారు కారు యజమాని, టీఆర్ఎస్ గోసుల శ్రీనివాస్. పోలీసులు తన కారును అనవసరంగా ధ్వంసం చేశారని వాపోయారు. మరో వైపు అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో అసోం సీఎం హిమంత బిశ్వాస్ శర్మ పర్యటనలో కూడా ఇలా జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.