Home > Featured > హాస్పిటల్ క్లీన్ చేసిన అమిత్ షా, జేపీ నడ్డా

హాస్పిటల్ క్లీన్ చేసిన అమిత్ షా, జేపీ నడ్డా

ఎప్పుడూ చేతిలో ఫైల్స్ పార్టీ పనులు,మంత్రిగా బాధ్యతలు ఇవన్నీ చూస్తూ బిజీగా ఉండే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా చీపురు పట్టారు. శనివారం ఉదయం ఎయిమ్స్‌కు వెళ్లి అక్కడి ఫ్లోర్లను క్లీన్ చేశారు. సేవా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఈ పని చేశారు. అనంతరం చిన్నపిల్లల వార్డుకు వెళ్లి వారికి పండ్లు పంపిణీ చేశారు. చికిత్స అందుతున్న విధానం హాస్పిటల్‌లో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

ఈనెల 17వ తేదీన ప్ర‌ధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సేవా సప్తాహ్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా వీరద్దరూ ఎయిమ్స్‌లో ఫ్లోర్ క్లీన్ చేశారు. పార్టీ కార్యకర్తలు మోదీ పుట్టిన రోజున సేవా సప్తాహ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోదీ పేద‌ల కోస‌మే ప‌నిచేసే వ్యక్తి అని ఈ సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యానించారు.

Updated : 13 Sep 2019 11:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top