తెలంగాణ ఎన్నికలపై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ ఎన్నికలపై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు

December 22, 2021

16

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చని, ఈ సారి కూడా ముందుస్తు ఎన్నికలకు కేసీఆర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోందన్నారు. అంతేకాకుండా ముందస్తు కోసం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారని అన్నారు. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశమిచ్చి అదృష్టాన్ని పరీక్షించుకునేలా కేసీఆర్‌ ప్లాన్ చేస్తున్నట్లు, టికెట్‌దక్కని సిట్టింగ్స్‌లో తమ పేరు ఉంటుందేమో అనే ఆందోళన శాసనసభ్యుల్లో రోజురోజుకీ ఎక్కువవుతున్నట్లు నియోజకవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయన్నారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ నాయకుల్లో చర్చ మొదలైంది.