చిరంజీవితో అమితాబ్.. పుకారా ? నిజమా ? - MicTv.in - Telugu News
mictv telugu

చిరంజీవితో అమితాబ్.. పుకారా ? నిజమా ?

August 2, 2017

‘ ఖైదీ నెం 150 ’ తర్వాత చిరంజీవి నటిస్తున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ’ పైన్నే వుంది అందరి దృష్టి. అయితే తాజా వార్త ఏంటంటే ఈ మెగా సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నట్టు సమాచారం. అమితాబ్ కు వెళ్ళి కథ చెప్పడం, ఆయన ఓకే అనడం కూడా జరిగిపోయాయనే వార్త ఆ సినిమా మీద మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ‘ బాహుబలి ’ సినిమాలా ఉయ్యాలవాడను కూడా సంచలన చిత్రంగా జాతీయ, అంతర్ఝాతీయ స్థాయలో నిలబెట్టాలని తండ్రీ – కొడుకులు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.
రాంచరణే తండ్రి సినిమాకు నిర్మాత. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడికల్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో బిగ్ బి భాగమవ్వటం ఈ చిత్రానికి చాలా ఉపకరిస్తుంది. ఆటోమెటిగ్గా వరల్డ్ మార్కెట్ ఈజీగా అయిపోతుందని చిత్ర వర్గాలు భావించినట్టున్నాయి. అందుకే అమితాబ్ కు కథ చెప్పి ఒప్పించుకోగలిగారట ? ఇది పుకారో నిజమో తెలియదు ??

ఓ సందర్భంలో అమితాబ్ తనకు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేస్కోవాలని వుందని అన్నాడు. ఇప్పడా మాట నిజమయ్యేలానే వుంది. అమితాబ్ గనక ఈ సినిమాలో నటిస్తే తప్పకుండా ఉయ్యాలవాడ స్పెషల్ సినిమా అయి తీరుతుంది. చూడాలి మరి ఈ వార్తలో నిజమెంత వుందో. అదే గనక నిజమైతే ఇది తప్పకుండా క్రేజీ ప్రాజెక్ట్ అవడం ఖాయం అంటున్నారు మెగా ఫ్యాన్స్.