Amitab name voice and images cannot be used without his permission
mictv telugu

పేరు.. ఫొటోలను ఎక్కడా వాడకూడదు!

November 25, 2022

Amitab name voice and images cannot be used without his permission

అమితాబ్ బచ్చన్.. ఫొటోలను, పేరును, వాయిస్ ఎక్కడా వాడకూడదని కోర్టు ఆదేశించింది. ఆయనకు సంబంధించిన కంటెంట్ను కూడా ఎక్కడా కనపడినా తొలగించాలన్నది.బాలీవుడ్ అనే కాదు, ఏ వుడ్ అయినా కూడా ఆయన సూపర్ స్టార్. అయితే ఆయన అనుమతి లేకుండా తన పేరు, వాయిస్, ఫొటోలను వాడుతున్నారు. దీంతో తన మర్యాదకు నష్టం వాటిలుతున్నట్లు ఆయన కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఈ రోజు ఢిల్లీ హై కోర్టు తీర్పునిచ్చింది. ఆయన అనుమతి లేకుండా ఫ్లాగ్ చేసిన కంటెంట్‌ను తొలగించాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోర్టు ఆదేశించింది.

80 యేండ్ల బిగ్ బి ఎన్నో ప్రకటనల్లో నటిస్తున్నారు. దానికి ఆయనకు నచ్చితేనే వాటిని చేస్తున్నారు. కానీ ఆయనకు సంబంధం లేని, నచ్చని వాటిని కొందరు చేయడం వల్లే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు న్యాయవాది నవీన్ చావ్లా అంటున్నారు. అమితాబ్ సెలబ్రిటీ హోదాను ఉపయోగించుకొని కొందరు తమ వస్తువులను, సేవలను ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. పుస్తక ప్రచురణ కర్తలు, టీ షర్టుల విక్రేతలు కూడా ఆయన ఫొటోలను వాడి లాభం పొందుతున్నారు. అందుకే వారి పైనే కాకుండా అనేక ఇతర వ్యాపారాలపై నిషేధాజ్ఞను కూడా కోరారు.

‘కొందరు టీ షర్ట్స్ తయారు చేసి వాటిపై ఆయన ముఖం పెట్టడం ప్రారంభించారు. ఎవరో అయా పోస్టర్ అమ్ముతున్నారు. ఎవరో అయితే ఏకంగా డొమైన్ amitabhbachchan.com రిజిస్టర్ చేశారు. అందుకే ఈ ఫిటిషన్స్ వేయాల్సి వచ్చింది’ అని బచ్చన్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదించారు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.