హాస్పిటల్‌లో చేరిన అమితాబ్..మూడు రోజులుగా అక్కడే.. - MicTv.in - Telugu News
mictv telugu

హాస్పిటల్‌లో చేరిన అమితాబ్..మూడు రోజులుగా అక్కడే..

October 18, 2019

బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హాస్పిటల్‌లో చేరారు. లివర్ సమస్య  కారణంగా మూడు రోజులుగా ఆకయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నానావతి హాస్పిటల్‌లో ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. అక్టోబర్ 11న బిగ్ బి తన  77 వ పుట్టినరోజును తన కుటుంబం మరియు సన్నిహితులతో జరుపుకున్నారు. ఆయన హాస్పిటల్‌లో చేరినట్టు తెలిసిన వెంటనే ఆయన ఆరోగ్యంపై పలువురు ఆరా తీస్తున్నారు.

Amitabh Bachchan.

దీనిపై హాస్పిటల్ వైద్యులు స్పందించారు. రెగ్యూలర్ చెకింగ్‌లో భాగంగానే ఆయన వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు.  ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని  చెప్పారు. దీనిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రత్యేక గదిలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కాగా తాజాగా ‘కార్వా చౌత్’ పండుగ సందర్భంగా బచ్చన్ తన అభిమానులను పలకరించారు.