ఓటీటీలో విడుదలకు సిద్ధమౌతున్న అమితాజ్ చిత్రం - MicTv.in - Telugu News
mictv telugu

ఓటీటీలో విడుదలకు సిద్ధమౌతున్న అమితాజ్ చిత్రం

May 14, 2020

Amitabh Bachchan

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. థియేటర్లు మూత పడటంతో ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండాపోయింది. అందరూ ఫోన్లు చేత పట్టుకుని ఎక్కువ సమయం ఆన్‌లైన్‌‌లో గడుపుతున్నారు. దీంతో ఇప్పడు వివిధ భాషల్లో సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్, ఆయుష్మాన్‌ ఖురానా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘గులాబో సితాబో’ కూడా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. జూన్ 12న అమెజాన్ ప్రైమలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రానికి సూజిత్‌ సిర్కార్‌ దర్శకత్వం వహించారు.  ఇందుకు సంబందించిన కొత్త పోస్టర్‌ను అభిమానులతో చిత్ర యూనిట్ పంచుకుంది.

ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గతేడాది నవంబరులో విడుదల కావాల్సి ఉంది. కరోనాతో సినిమాను ఏప్రిల్‌ 28, 2020 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లాక్‌డౌన్ పొడిగించడంతో ఏప్రిల్‌ 17కు వాయిదా వేసుకున్నారు. లాక్‌డౌన్ మళ్లీ పొడిగించేసరికి ఇక థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునేలా లేవని భావించిన దర్శక నిర్మాతలు.. సినిమాను ఓటీటీలోనే విడుదల చేయాలని భావించారు. ఈ విషయమై దర్శకుడు సూజిత్ సిర్కార్ మాట్లాడుతూ.. ‘నా సినిమాను ఇంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వంట పూర్తయింది.. ఇక వడ్డించడమే ఆలస్యం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేమంతా ఈ డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నాం’ అని తెలిపారు.