78 ఏళ్లలో నేర్చుకోలేనివెన్నో ఈ లాక్‌డౌన్‌లో నేర్చుకున్నా  - MicTv.in - Telugu News
mictv telugu

78 ఏళ్లలో నేర్చుకోలేనివెన్నో ఈ లాక్‌డౌన్‌లో నేర్చుకున్నా 

May 31, 2020

Amitabh Bachchan

కరోనా వైరస్‌‌తో ఒక్కసారిగా ప్రజా జీవితాలు తలకిందులయ్యాయి. ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. మాయదారి రోగంలా మనుషులను టకటకమని ఎగరేసుకుపోతున్న కరోనాతో ప్రజలు ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకున్నారు. దీనిపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ఈ 78 ఏళ్లల్లో నేర్చుకోలేనిది ఈ కరోనా సమయంలో నేర్చుకున్నానని చెప్పారు. గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌ మొత్తం సమయాన్ని కూతురు ఇంట్లో గడిపిన అమితాబ్.. అక్కడ మనుమరాలు, ఇతర చిన్నారులతో సమయం గడిపారు. లాక్‌డౌన్‌ కారణంగా జయబచ్చన్‌ ఢిల్లీలోనే ఉండిపోయారు.

లాక్‌డౌన్‌ 5.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన సందర్భంగా అమితాబ్ కాస్త వెసులుబాటుగా ఫీలయ్యానంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఒకప్పటి ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. తన 78 ఏండ్ల వయసులో నేర్చుకోలేని విషయాలను కేవలం లాక్‌డౌన్‌ పీరియడ్‌ నాకు నేర్పింది అని పేర్కొన్నారు. ‘నాకు ఎంతో తెలుసు, ఎన్నో నేర్చుకొన్నా, ఎన్నో అంశాలపై అవగాహన ఉంది అని ఇప్పటివరకు అనుకునే వాడిని. అయితే, కరోనా వల్ల ఏర్పడ్డ లాక్‌డౌన్‌ సమయం నాకు ఎన్నో విషయాలను తెలుసుకొనేట్లు, నేర్చుకొనేట్లు, అర్థం చేసుకొనేట్లు చేసింది’ అని కాప్షన్‌ పెట్టారు. దీనిపై ఆయన అభిమానులు స్పందిస్తున్నారు. నిజమే కరోనా ఎందరికో ఎన్నో పాఠాలు నేర్పింది అని కామెంట్లు చేస్తున్నారు.