‘అమితాబ్ గారూ.. ఆమాత్రం ధైర్యం లేదా’? నెటిజన్ల ట్రోల్ - MicTv.in - Telugu News
mictv telugu

‘అమితాబ్ గారూ.. ఆమాత్రం ధైర్యం లేదా’? నెటిజన్ల ట్రోల్

March 18, 2022

 

nfgn

చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్లు సాధిస్తూ రూ. వంద కోట్ల క్లబ్‌లో చేరడానికి ఉరకలేస్తున్న సినిమా ద కశ్మీర్ ఫైల్స్. దేశ ప్రధాని సహా ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకున్నారు. తాజాగా బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఓ ట్వీట్ చేశారు. ‘గతంలో మనకు తెలియనిది. ఇప్పుడు తెలుస్తోంది.’ అంటూ తన భావాన్ని వ్యక్తపరిచారు. అయితే ఇందులో సినిమా పేరును ప్రస్తావించకపోవడంపై నెటిజన్లు విమర్శిస్తున్నారు. సూటిగా పేరును వాడొచ్చుగా. ఎందుకంత భయపడుతున్నారు? అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేసింది. ఇంత భయపడుతూ చెప్పడం అవసరం లేదంటూ మరి కొందరు తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు.