Amitabh Bachchan reveals he cut a vein on his calf, was rushed to hospital
mictv telugu

అమితాబ్ కి ప్రమాదం.. హుటాహుటిన ఆసుపత్రికి.. ఆందోళనలో అభిమానులు

October 24, 2022

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి ప్రమాదం జరిగింది. అనుకోని సంఘటనతో తీవ్ర రక్తస్రావం కావటంతో హుటాహుటిన బిగ్ బీని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం తన ఎడమ కాలి నరం తెగిపోవడంతో హుటాహుటిన అమితాబ్ ని ఆసుపత్రికి తరలించారు. 80 ఏళ్లు నిండిన ఈ సినిమా ఐకాన్ అధికారిక బ్లాగ్‌ ఈ వార్తని ప్రచురించింది. కుట్ల సాయంతో రక్తస్రావాన్నిడాక్టర్లు నియంత్రించినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.

షూటింగ్ సెట్ లో పదునైన ఇనుప ముక్క అమితాబ్ బచ్చన్ కాలుకి బలంగా తాకింది. దీంతో ఎడమ కాలు నరం తెగి సెట్స్ విపరీతంగా రక్తస్రావం జరిగింది. బ్లీడింగ్ అధికంగా ఉన్న నేపథ్యంలో అమితాబ్ ని సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్స్ గాయానికి కుట్లు వేసి వైద్యం చేశారు. అలాగే కొన్ని రోజుల పాటు నడవ కూడదని, బెడ్ కే పరిమితం కావాలని సూచించారు. అయితే ఈ ప్రమాదంలో తానూ క్షేమంగానే ఉన్నట్టు.. అభిమానులు ఆందోళన చెందవద్దని అమితాబ్ సందేశం చేశారు.